పిల్లల మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలకూర, బ్రోకలి వంటి వాటిని అందించడం ద్వారా వారిలో ఆలోచన శక్తి పెరుగుతుంది.
ఫ్యాటీ ఫిష్ కూడా మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదుడకు మేలు చేయడంతో పాటు భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి సమస్యను దూరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో బెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో తేలింది. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి.
మెదడును ఉత్తేజ పరచడంలో కాఫీ, టీలు బాగా ఉపయోగపడుతాయని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. గర్భిణీలు వీటిని తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు.
మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంలో నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చిన్నారుల్లో సరిపడ నిద్రలేకపోతే మానసికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
టీవీలు, స్మార్ట్ ఫోన్స్ చిన్నారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాబట్టి పిల్లల స్క్రీన్ టైమ్ భారీగా తగ్గించాలి. గంటలతరబడి స్క్రీన్లకు అతుక్కుపోయే వారి మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.