TV9 Telugu

21 March 2024

అందాన్ని పెంచే ఆరోగ్యం.. 

అందాన్ని కాపాడడంలో డ్రై ఫ్రూట్స్‌ ఎంతగానో ఉపయోపగడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు అందాన్ని కాపాడుతాయి.

గ్రీన్ టీలోని శక్తిమంతమైన ఫ్లేవనాయిడ్స్‌ వివిధ రకాల జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తుంది.

చేపల్లోనే ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వారంలో కనీసం రెండు సార్లైనా చేపలు తినాలని చెబుతున్నారు.

ఆకు కూరల్లోని పొటాషియం, మెగ్నీషయం, సోడియం వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ గాయాలను తగ్గిస్తాయి.

దానిమ్మ కూడా అందాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మ కణాలను రక్షిస్తాయి.

చర్మ అందాన్ని కాపాడడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి చర్మం నిగనిగలాడుతుంది.

గుమ్మడి విత్తనాల్లోని పీచు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మాన్ని మెరిపించేలా చేస్తుంది. ఇందులోని జింక్‌ ఇమ్యూనిటీని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.