30 June 2024

థైరాయిడ్‌తో  బాధపడుతున్నారా.? 

Narender.Vaitla

థైరాయిడ్‌ సమస్య ఉన్న వారు ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని. హైపో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడంలో ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనె కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది. ఇందులోని మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అవిసె గింజలుల్లో మంచి గుణాలు శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించి థైరాయిడ్‌ గ్రంథి మెరుగ్గా పని చేసేలా  చేస్తాయి. కాబట్టి వీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

థైరాయిడ్‌తో బాధపడేవారు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ స‌మ‌స్యతో ఇబ్బందులు పడేవారికి ఉపయోగపడుతుంది.

సాధారణంగా థైరాయిడ్ ఆటో ఇమ్యూన్‌ కారణంగా సంభవిస్తుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగాలంటే పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్‌కు చెక్‌ పెట్టడంలో దానిమ్మ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పాలీ ఫెనాల్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.