ఆపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైర్ దంతాలపై బ్యాక్టీరియా వృద్ధికి కారణమయ్యే కుహరాన్ని తొలగిస్తుంది.
పైనాపిల్‌ను తీసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. ఇది దంతాలపై క్యావిటీస్ ఏర్పడుకుండా చూస్తుంది. అంతేకాకుండా దంతాల మధ్య పేరుకుపోయిన ఫలకాన్ని తొలగిస్తుంది.
జామ కూడా దంతలా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొత్తం నోటి ఆరోగ్యాన్ని రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవి దంతాలకు బ్రషింగ్, స్క్రబింగ్ చేసినట్లు ఉంటుంది.
దంతాలపై పేరుకుపోయిన మురికిని తొలగించడంలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది.
విటమిన్ సి పుష్కలంగా అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల దంతాలపై పసుపు రంగుత తొలగిపోతుంది. ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
ప్రతీరోజూ కచ్చితంగా తగినంత నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి.
చెరుకు కూడా పంటిపై ఉన్న పచ్చదనాన్ని పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెరుకును నోటితో కొరికి తినడం వల్ల దంత సమస్యలు తగ్గడమే కాకుండా పచ్చగా మారవు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.