ఇవి తినండి.. చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టండి 

16 September 2023

సబ్జా గింజలను నిత్యం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. పొట్ట పేగుల్లోకి కొలెస్ట్రాల్‌ ప్రవేశించకుండా అడ్డుకుటుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి తరమికొడుతుంది. 

సబ్జా గింజలు.. 

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో జామది ముఖ్యపాత్ర. జామలో ఉండే పొటాషియం శరీరంలోని విషతుల్యాలను నిర్వీర్యం చేయడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

జామ.. 

ద్రాక్ష కూడా చెడె కొలెస్ట్రాల్‌ను తరిమికొడుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని విషతుల్యాలను నిర్వీర్యం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ద్రాక్ష.. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తరమికొట్టడంలో వంకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్‌ ఆక్సీకరణ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

వంకాయ.. 

 గుండె రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేసే గుణం బ్లాక్‌బెర్రీలో ఉంటుంది. వీటిలోని పెక్టిన్‌ కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు వంపిస్తుంది. 

బ్లాక్‌ బెర్రీలు.. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీన్స్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ తయారీని అడ్డుకుంటుంది. లేసిథిన్‌ కొవ్వను కరిగించేస్తుంది. 

బీన్స్‌.. 

రక్తంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వల్ని తగ్గించడంలో యాపిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్స్‌లోని మాలిక్‌ ఆమ్లం శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది. 

యాపిల్‌..

చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి తరిమికొట్టడానికి ఓట్స్‌ కూడా ఉపయోగపడతాయి. ఓట్స్‌లోని బీటా గ్లూకస్‌ అనే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది. 

ఓట్స్‌..