వంటకంలో కచ్చితంగా ఉపయోగించే వెల్లుల్లి క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. ఇందులోని లెహ్సన్ క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటుంది.
బ్రోకలీకూడా క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదులను అడ్డకుటుంది.
బెర్రీలలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌కు కారణమనే హానికరమైన ఫ్రీరాడికల్స్‌తో పోరాటం చేస్తాయి. తరచుగా వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మన వంటింట్లో కచ్చితంగా ఉండే పసుపు కూడా క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. పసుపును తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరైన గ్రీన్ టీ కూడా క్యాన్సర్‌ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
టమాటలోని లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కడుపు క్యాన్సర్ దరిచేరకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీరోజూ టమాటను తీసుకోవాలి
ఇక రోజు ఆకు కూరలు తినడం వల్ల కూడా క్యాన్సర్ దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సహజ విటమిన్లు, ఖనిజాలు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం