చర్మం హైడ్రేట్‌గా ఉంటే జిడ్డు సమస్య తగ్గాలంటే శరీరంలో ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి. ఇందుకోసం కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. ఇది చర్మాన్ని క్లీన్ చేసి నూనెలను తొలగిస్తుంది.
జిడ్డు చర్మంతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. జిడ్డు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది స్కిన్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.
చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జిడ్డు సమస్య తగ్గుతుంది. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ స్కిన్‌ను నుంచి ఉపశమనం లభిస్తుంది.
సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. నిమ్మ, నారింజలోని ఆక్సిడెంట్లు చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది
బాదం, జీడిపప్పు, పిస్తా వంటి గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ స్కిన్‌ను తొలగిస్తుంది.
ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జిడ్డు సమస్య పరార్ అవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ చర్మం జిడ్డుంన నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.