మైగ్రేన్‌తో బాధపడే వారు సమ్మర్‌లో పుచ్చకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని నీటి శాతం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది.
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మేలు చేస్తాయి.
సమ్మర్‌లో పెరుగును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉండి తలనొప్పి తగ్గుతుంది.
మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమ్మర్‌లో వచ్చే మెగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో ప్రతీ రోజూ ఒక అరటి పండు తీసుకుంటే మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌కు బెర్రీస్ పెట్టింది పేరు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ కూడా సమ్మర్‌లో మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ తలనొప్పిని దూరం చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.