TV9 Telugu

08 March 2024

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.? 

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు పసుపు తీసుకోవాలి. పసుపు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వాల్‌నట్‌, అవిసెగింజలు, చియా గింజలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇందులో ఒమెగా 3 ఫ్యాసీ యాసిడ్‌లు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

నువ్వులు కూడా ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా నువ్వుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే మెగ్నీషియ, పాస్పరస్‌కు కూడా నువ్వులు పెట్టింది పేరు. 

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు పెట్టింది పేరైన సాల్మన్‌ చేపలతో కీల్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. 

బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిండచంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

బ్రోకలీ కూడా కీళ్ల నొప్పులు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఔషధ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు వాపును తగ్గిస్తుంది

కీళ్ల నొప్పులను తగ్గించడంలో అరటి పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సమృద్ధిగా ఉండే పొటాషియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. మెగ్నిషియం కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.