వెంట్రుకలు ఊడిపోతున్నాయా.? ఇవి తినండి చాలు 

Narender Vaitla

07 September 2024

పెరుగులోని ప్రోటీన్‌ వెంటుక్రల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మాడుకు రక్త సరఫరా మెరుగుపడటానికి, వెంట్రుకలు పెరగటానికి తోడ్పడే విటమిన్‌ బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌) కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలు పలుచబడకుండా, ఊడిపోకుండా కాపాడుతుంది.

వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉపయోగపడతాయి. శరీరానికి ఇది లభించాలంటే చేపలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పాలకూరలో వెంట్రుకలకు మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ ఎ, ఐరన్‌, బీటా కెరొటిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ సి మాడు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. 

చికెన్‌లో లభించే సంతృప్త కొవ్వు ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ లభిస్తుంది. కాబట్టి చికెన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం మెరుగువుతుంది. 

గుడ్లు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయిని నిపుణులు చెబుతున్నారు. గుడ్లలోని బయోటిన్‌ వెంట్రుకలు పెరగటానికి తోడ్పడుతుంది.

వెంట్రుకలు చిట్లడం, విరిగిపోవడం వల్ల ఎక్కువగా ఊడిపోతుంటాయి. దీనికి చెక్‌ పెట్టాలంటే జామను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని విటమిన్‌ సి ఈ సమస్యకు చెక్‌ పెడుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఒక దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్‌, పోషకాలు ఎక్కువగా అందుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.