వేసవిలో గర్భిణీలు టమోటాలను కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి శిశువు రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి అవసరం. టొమాటోలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మేలు చేస్తుంది.
సమ్మర్‌లో డీహైడ్రేష్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు కాల్షియం వంటి పోషకాలకు పెట్టింది పేరు. అలాగే గర్భిణీలు ఎదుర్కొనే జీర్ణ సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టొచ్చు.
ఫోలేట్, ఐరన్, విటమిన్ K పుష్కలంగా ఉండే ఆకుకూర గాయలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మేలు చేస్తోంది.
గర్భిణీలు ఎదుర్కొనే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే అరటి పండును తీసుకోవాలి. రోజూ రాత్రి కచ్చితంగా ఒక అరటి పండును తీసుకోవాలి.
గర్భిణీలకు కివీ బెస్ట్ పండుగా చెబుతారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి, ఇ, ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
సమ్మర్‌లో గర్భిణీలు కచ్చితంగా రోజుకో యాపిల్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శిశివు రోగనిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.