26 July  2024

పాలిచ్చే తల్లులు ఇవి  పాటించాల్సిందే.. 

పాలిచ్చే తల్లులు పౌల్ట్రీ, చేపలు, గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల పాలు బాగా పడడంతో పాటు చిన్నారుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాలకరూర, తోటకూర, బచ్చలికూర వంటివి భాగం చేసుకోవాలి. వీటిలోని ఐరన్‌, కాల్షియం, ఫొలేట్‌ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

పాలిచ్చే తల్లులు బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి.

పాలు ఇచ్చే తల్లులకు కావాల్సిన పోషకాలు అందాలంటే కచ్చితంగా రోజూ కోడి గుడ్డును తీసుకోవాలి. వీటిలోని మంచి గుణాలు శిశువు మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

తల్లులు కచ్చితంగా డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్‌, ఫైబర్‌ తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల తల్లితో పాటు, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పాల ఉత్పత్తికి దోహదం చేయడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల తల్లులకు మేలు జరుగుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.