TV9 Telugu

21 April 2024

శరీరానికి మెగ్నీషియం  అందించే ఫుడ్‌ ఇవే.. 

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. సుమారు 30 గ్రాముల బాదంతో 80 మిల్లి గ్రాముల మెగ్నీషియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక జీడిపప్పు కూడా మెగ్నీషియంకు పెట్టింది పేరు. సుమారు 30 గ్రాముల జీడిపప్పులో 72 మి.గ్రాముల మెగ్నీషియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజల్లోనూ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 30 గ్రాముల గుమ్మడి గింజల్లో 150 మిల్లి గ్రాముల మెగ్నీషియం పొందొచ్చు.

ఇక అవిసె గింజల ద్వారా కూడా శరీరానికి కావాల్సిన మెగ్నీషియం లభిస్తుంది. చెంచాడు అవిస గింజెల్లో 40 మి.గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. 

కంది పప్పు ద్వారా కూడా శరీరానికి కావాల్సిన మెగ్నీషియం పొందొచ్చు. మెగ్నీషియంను కంది ద్వారా సులభంగా పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక పాలలో కూడా మెగ్నీషియం కంటెంట్‌ ఉంటుంది. ఒక కప్పు పాలలో 27 మి.గ్రాముల మెగ్నీషియం శరీరానికి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మెగ్నీషియం లోపం జయించాలంటే పెరుగును కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పావు కిలో పెరుగులో 42 మి.గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.