TV9 Telugu

9 April 2024

ఎప్పుడూ యంగ్‌గా  కనిపించాలా.? 

ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలనుకుంటే ముందుగా ఒత్తిడిని జయించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ప్రాసెస్‌ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్న తనంలోనే చర్మం ముడతలు పడడం వంటి సమస్యలు వస్తాయి.

ఇక త్వరగా జీర్ణమయ్యే ఆకు కూరలు, ఫైబర్‌ ఎక్కువగా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిత్యం యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు

ఆల్కహాల్‌, స్మోకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అలవాట్ల వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలైనా నడకను అలవాటగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

నాణ్యమైన నిద్ర కూడా నిత్యం యవ్వనంగా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. 

శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా తగిన నీటిని తీసుకోవాలి. నీటితో పాటు కొన్ని పండ్ల రసాలను కూడా భాగం చేసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.