కీళ్ల నొప్పులను తగ్గించడంలో కొత్తమీర కీలక పాత్ర పోషిస్తుంది. తీసుకునే ఆహారంలో కొత్తమీర కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.
పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్లలో కదలికలు సరిగ్గా ఉండేలా ఉపయోగపడుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు కీళ్ల సమస్యలను దూరం చేస్తాయి. బెర్రీ పండ్లలో యాంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి శరరీంలోని వాపులను తగ్గిస్తాయి. అందువల్ల బెర్రీలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ కూడా కీళ్ల సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వాల్ నట్స్, బాదం పప్పు, అవిసె గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులను కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇందులోని ఫాలిఫినాల్స్ శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచార మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.