ఇన్‌స్టంట్ శక్తిని అందించడంలో ఓట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలలో కొన్ని ఓట్స్ కలుపుకొని తీసుకోవాలి. ఇందులోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి నూతనోత్తేజం అందిస్తాయి.
నిస్సత్తవకు డీహైడ్రేషన్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ సరిపడ మంచి నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీటిలో పంచదార లేదా ఉప్పు వేసుకొని తాగాలి.
పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇన్‌స్టాంట్ ఎనర్జీని పొందొచ్చు. ఇందులోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇందులోని అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. ఉదయం, సాయంత్రం తీసుకుంటే యాక్టివ్‌గా ఉంటారు.
శరీరంలో ఐరన్ తగ్గినా నిస్సత్తువగా ఉంటుంది. అందుకే పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్‌స్టాంట్ శక్తిని పొందొచ్చు.
ప్రతీ రోజూ ఒక గుడ్డును తీసుకోవడం వల్ల శక్తిని పొందొచ్చు. ముఖ్యంగా శరీర కణజాలాల పెరుగుదల, మరమ్మత్తులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది
ఇక ఎప్పుడూ యాక్టివ్ ఉండాలి అంటే అడపాదడపా చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తిని అందిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.