23 May 2024

నిత్యం నీరసంగా ఉంటుందా.? 

Narender.Vaitla

రోజంతా ఎనర్జీగా ఉండాలంటే అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే అరటి పండు తీసుకుంటే రోజంతా అదనపు శక్తి ఉంటుంది.

రోజంతా శక్తి ఉండాలంటే ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం శరీరానికి శక్తిని అందిస్తాయి. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది. ఇందులోని ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ప్రోటీన్‌ రోగ నిరోధ‌క వ్యవ‌స్థను బలోపేతం చేస్తుంది.

రోజూ ఉదయాన్నే రెండు బాదం పప్పులు తింటే రోజంతా ఉషారుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఈ, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్, మాంగనీస్, ఫైబర్‌తో శక్తిని అందిస్తాయి.

రోజంతా ఉషారుగా ఉండాలంటే కచ్చితంగా ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను సొంతం చేసుకోవచ్చు.

ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌గా రెండు గుడ్లను తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉండొచ్చు. 

ఇక మరీ నీరసంగా అనిపిస్తే కాఫీ, టీ, చాక్లెట్ వంటి వాటి తీసుకోవడం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా శక్తి లభిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.