రోజంతా ఉత్సాహంగా ఉండాలా.? 

TV9 Telugu

12 February  2024

ఇన్‌స్టాంట్‌ శక్తి అందడంలో అరటి పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇందులోని మెగ్నీషియం శక్తిని అందిస్తాయి.

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే పెరుగును కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోబయోటిక్స్‌ రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఎనర్జీ లెవల్స్‌ తగ్గొద్దంటే పెరుగు తీసుకోవాలి. 

ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్‌, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌తో రోజంతా ఉషారుగా ఉండొచ్చు. 

పాలకూర, తోటకూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఐరన్‌ నిస్సత్తువను దరిచేరకుండా చేస్తుంది.

 గ్రీన్‌ టీ కూడా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరానికి శక్తినివడడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

ఇక నీరసానికి డీ హైడ్రేషన్‌ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అందుకే రోజులో కనీసం 6 నుంచి 8 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరం ఎప్పుడు హైడ్రేట్‌గా ఉంటుంది. 

ఉన్నపలంగా శక్తినిచ్చే వాటిలో తాజా పండ్లు ఒకటి. సిట్రస్‌ జాతికి చెందిన పండ్లతో సీజన్‌లో లభించే పండ్లను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.