ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తేనె తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తేనెలోని సహజసిద్ధ ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కనీసం ఒక టీస్పూన్ తేనె తీసుకుంటే శరీరం దృఢంగా మారుతుంది.
ఎక్కువ కాలం జీవించాలంటే లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లవంగాల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటిసెప్టిక్ నివారిణిగా పనిచేస్తుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే వామును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాములోని నియాసిన్, థైమోల్ వంటివి గుండె వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.
ఉసిరి కూడా ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరిలోని ఔషధ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు గురికాకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యానికి మేలు చేయడంలో అల్లం కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో 25 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వ్యాధులు కలిగించే కణాలతో పోరాడి మీ శరీరాన్ని కాపాడుతాయి.
ఆయుష్షు పెంచడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోకి కర్‌క్యుమిన్ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. క్యాన్సర్ నుంచి అల్టీమర్స్ వరకు చెక్ పెడుతుంది.
ఆరోగ్యంగా ఉండడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యూరోలితిన్ ఎ అనే రసాయం పుష్కలంగా ఉంటుంది. కండరాల సామర్థ్యం పెరిగినట్లు పరిశోధనలు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.