TV9 Telugu

11 May 2024

రోజూ ఒక గుడ్డు తినమనేది ఇందుకే.. 

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా చిలగడ దుంపలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ చర్మంపై ముడతలు రాకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. 

కోడి గుడ్లలో బయోటిన్, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే.. బలమైన జుట్టు, గోర్లు, అందమైన చర్మం మీ సొంతమవుతుంది. ఇది చర్మానికి పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆకు కూరలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ముడతలు రాకుండా మెరిసే చర్మాన్ని కాపాడుతాయి.

ఇక చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలని నీటి శాతం ఎక్కువగా పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా, యంగ్‌గా కనిపిస్తుంది. 

డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్కిన్ ఆరోగ్యం మెరుగువుతుంది. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వీటితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతీ రోజూ కచ్చితంగా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. 

యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరైన కివీ పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సి చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.