పరీక్షల వేళ.. ఈ ఫుడ్‌తో జ్ఞాపకశక్తి పెంచుకోండి.
18 January 2024
TV9 Telugu
మినుములు, మిల్లెట్స్ వంటి తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ప్రోటీన్ ఉండే ఈ ఫుడ్ మెదడుకు మేలు చేస్తుంది.
వారంలో ఒక్కసారైనా చేపలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చేపల వల్ల చిన్నారుల్లో మెదడు పనితీరు మెరుగవుతుంది.
తీసుకునే ఆహారంలో బీన్స్ ఉండేలా చూసుకోవాలి. బీన్స్‌లో ప్రోటీన్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తాయి.
చిన్నారులకు డ్రై ఫ్రూట్స్‌ను కచ్చితంగా అందించాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల మెదుడుకు కావాల్సిన శక్తి , ప్రోటీన్లు లభిస్తాయి.
చదువుకునే వారికి ఆకు కూరలను అలవాటు చేయాలి. వీటిలోని విటమిన్స్, ఐరన్, మినరల్స్ శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి.
ఇక ప్రతీ రోజూ ఒక గుడ్డును చిన్నారులకు కచ్చితంగా అందించాలి. గుడ్లలో అధికంగా ఉండే ప్రొటీన్లు ఏకాగ్రతను పెంచుతాయి.
చిన్నారులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. ఇలా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..