25 July  2024

వర్షాకాలం రోగాల బారిన పడొద్దంటే...

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సిట్రస్‌ పండుతలు ఉపయోగుడుతాయి. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సి శరీరాన్ని సాధారణ అంటు వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. 

బ్రోకలిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇతో పాటు ఫైబర్‌ కంటెంట్‌ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి వంటకు సువాసన తీసుకురావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. బ్లెడ్‌ సెల్స్‌ను పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, మెగ్నిషియం.. వర్షాకాలంలో సహజంగా వచ్చే గొంతునొప్పి వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

పసుపు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుసుపు దివ్యౌషధం కాబట్టే మన పూర్వీకులు పసుపును మన ఆహారంలో ఒక భాగం చేశారు. అంటు వ్యాధులను అడ్డుకోవడంలో పుసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్‌ టీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

వర్షాకాలం సహజంగానే వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో నీటిని తక్కువగా తీసుకుంటారు. అందుకే ఈ సీజన్‌లో కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం,  కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్‌లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం