సంతానోత్పత్తిని పెంచడంలో ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇఇద లభించే బచ్చలికూర, బ్రోకలీ, పాలకూర, బీన్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
సంతానోత్పత్తిని పెంచడంలో బీ12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. బీ12 ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి.
ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే చేపలు, నట్స్ వంటి వాటిని తీసుకుంటే సంతానోత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొన్ని రకాల ఫుడ్స్‌తో సంతానోత్పత్తిపై ప్రతిలకూల ప్రభావం చూపుతాయి. ప్రాసెస్ చేసిన మాంసం, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మహిళలే కాదు పురుషుల్లోనూ సంతానోత్పత్తిపై ఆహారం ప్రభావం చూపుతుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని పెరగడానికి నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల శుక్ర కణాల నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పురుషులు ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి. పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత దెబ్బ తింటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.