గుండె కోసం ఇవి తినండి..

Narender Vaitla

03 September 2024

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, క్యాల్సియం గుండెను భద్రంగా చూసుకుంటుంది.

డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ఇందులోని మంచి కొవ్వు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చేపలు కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె స్థిరంగా కొట్టుకోవటానికి, రక్తపోటు తగ్గటానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి దోహదపడుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణ సాజావుగా సాగేలా చేస్తుంది. 

బీన్స్‌లో ఫైబర్‌, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోపగడుతుంది.

నిత్యం పండ్లను తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగవువుతంది. పండల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం కాపాడడంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌, విటమిన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.