దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. 

19 November 2023

విటమిన్‌ సి ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. నిమ్మ, ఆరెంజ్‌, ద్రాక్షలాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.

దంతాలను దృఢంగా మార్చడంలో క్యాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి పాలను తీసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా మారుతాయి.

దంతాల మధ్య ఇరుక్కునే ఆహార పదార్థాల వల్ల కూడా పళ్లు పాడుతాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని పుకిలించి ఉంచాలి. 

దంతాలపై ఉన్న మరకాలు పోవాలంటే నువ్వుల నూనెతో పుకిలించి ఉంచాలి. దీంతో దంతాలు శుభ్రపడుతాయి. కోల్పోయిన ఖనిజాలు తిరిగి పొందొచ్చు. 

విటమిన్‌ డీ దంతాల ఆరోగ్యాన్ని కాపడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాల్మన్‌ చేపలు తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

దంతాలకు మేలు చేసే క్యాల్షియం చీజ్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాసిడ్స్‌, చక్కెరలు తక్కువగా ఉంటాయి.

పచ్చి ఉల్లి గడ్డను తినడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇందులోని యాంటీ మైక్రోబియల్ సల్ఫర్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్‌ టీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి దంతాలను రక్షించుకోవచ్చు.