ప్రతీ రోజు కచ్చితంగా ఏదో ఒక పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు.
ఇక ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల అధిక బరువు మొదలు, మరెన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.
మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ బియ్యంతో పోల్చితే మిల్లెట్స్ మంచి పోషణను అందిస్తాయి.
ప్రతిరోజు కచ్చితంగా ఒక గుడ్డును తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. శరీరానికి అవసరమైన ఎన్నో ప్రోటీన్లు గుడ్డు ద్వారా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలు, బఠానీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం పదిలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇక ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతిరోజూ పాలు, పెరుగును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే, ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.