ఆరోగ్యంగా ఉండాలంటే అరటి పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం శరీరానికి తక్షణ శక్షిని అందిస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో ఉపయోగపడే ఓట్స్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే మేలు జరుగుతుంది.
పాలకూర ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఐరన్, మెగ్నీషియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎర్ర కర్త కణాలను వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్ ఉండే నైట్రేట్‌లు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగువుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటే ఎన్నో లాభాలుంటాయి.
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఒక కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కోడి గుడ్డులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే.
విటమిన్‌సి పుష్కలంగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్ల కారణంగా ఆరోగ్యం మెరుగవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.