వీటితో కంటి ఆరోగ్యం, పదిలం..
12 January 2024
TV9 Telugu
'విటమిన్ ఏ' పుష్కలంగా ఉండే ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పోషిస్తుంది. అందుకే ఉసిరిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆకు కూరల వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకుపచ్చని పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజ, బత్తాయి కూడా కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని కాపాపడడంలో ఉపయోగపడుతాయి.
క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సమృద్ధిగా ఉండే.. బీటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ నానబెట్టిన రెండు బాదలంను తీసుకుంటే మంచిది.
ఇక చికెన్, గుడ్డులు కూడా కళ్లకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్య విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..