TV9 Telugu

5 April 2024

మెరిసే చర్మం.. వీటితో సొంతం. 

చర్మాన్ని సంరక్షించడంలో నట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ చర్మానికి మంచి పోషణ అందిస్తాయి.

టమోటాల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరిసిపోతుంది.

కీర దోస కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేసే శక్తి కీర దోసలోని పోషకాలకు ఉంటుది. దీంతో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

పాలకూరలో పుష్కలంగా లభించే.. విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ పోషకాలు చర్మానికి మేలు చేయడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తాయి.

క్యాప్సికమ్‌ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు, నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్‌ మిలాన్‌ను తీసుకోవాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.