TV9 Telugu

21 March 2024

హ్యాంగోవర్‌తో తల బద్ధలవుతోందా.? 

ఆల్కహాల్‌ ద్వారా వచ్చే హ్యాంగోవర్‌కు చెక్‌ పెట్టడంలో టమాట ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం పచ్చి టమాట తినాలని తెలిపారు.

ఉదయం టిఫిన్‌లో భాగంగా ఓట్స్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాలేయానికి కలిగే నష్టం నుంచి రక్షించడంలో ఓట్స్‌ ఉపయోగపడుతుంది.

మద్యం సేవించే ముందు గుడ్డు తీసుకుంటే హ్యాంగోవర్‌ రాదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లలోని సిస్టీన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది యాంగోవర్లకు గురి కాకుండా తగ్గిస్తుంది.

హ్యాంగోవర్‌ వేధించకుండా ఉండాలంటే అరటి పండు తీసుకోవాలి. ఇందులోని పొటాషియం మద్యాన్ని రక్తప్రవాహంలోకి ప్రవేశించకుండా సహాయపడుతుంది.

అవకాడో కూబా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇది మద్యాన్ని రక్తప్రవాహంలోకి ప్రవేశించకుండా నెమ్మది పరచటానికి సహాయపడుతుంది.

ఇక ఆల్కహాల్ తీసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో కలిపి తాగడం వల్ల హ్యాంగోవర్లను నివారించవచ్చు.

ఆల్కహాల్‌ సేవిస్తే డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. కాబట్టి నీరు బాగా తాగాలి. అలాగే కొబ్బరి బోండాలు వంటి డ్రింక్స్‌ను తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.