కంటి ఆరోగ్యం.. ఇవి తింటే పదిలం. 

Narender Vaitla

28 November 2024

కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో క్యారెట్‌ ఎంతో ఉయోపగుడుతంది. ఇందులోని బీటా కెరోటిన్‌ రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది.

పచ్చని ఆకు కూరలను ఆహారంలో భాగం చసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇందులోని విటమిన్‌ ఎ, లుటిన్‌ కంటి కండరాలను బలోపేతం చేస్తుంది.

రోజుకో గుడ్డు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగువుతుంది. ముఖ్యంగా పచ్చసొనాలో ఉండే ల్యూటిన్‌ రెటీనాను హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది.

ఆరెంజ్‌లో పుష్కలంగా ఉండే విటనిస్‌ సి  కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇది కంటి కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్‌లో ఉండే బీటా కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కళ్లు పొడిబారడం సమస్యకు చేపలు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని విటమిన్‌ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కంటి సమస్యలను దూరం చేస్తాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.