08 July  2024

డెంగ్యూను తరిమికొట్టాలంటే.. 

Narender.Vaitla

డెంగ్యూ బారిన పడిన వారు బొప్పాయి తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతకు చెక్‌ పెడుతుంది.

విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నారింజను తీసుకోవడం వల్ల కూడా డెంగ్యూ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

డెంగ్యూ జ్వరం వచ్చిన వారు కివిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కివి ఉపయోగపడుతుంది.

ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే డెంగ్యూ ద్వారా కలిగే రక్త హీనత తగ్గుముఖం పడుతుంది.

డెంగ్యూతో బాధపడే వారు బెర్రీలను ఆహారం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. 

డెంగ్యూ బారిన పడి వారు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో దానిమ్మ ఒకటి. దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు రక్త హీనత సమస్యను తరిమికొడుతుంది.

డెంగ్యూతో బాధపడేవారికి డీహైడ్రేషన్‌ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొబ్బరి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.