11 July  2024

లైంగిక సామర్థ్యం పెరగాలా.? 

Narender.Vaitla

లైంగిక సామర్థ్యం పెంచడంలో డ్రై ఫ్రూట్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బాదం, జీడిపప్పు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల లైంగిక సామర్థ్యం బలపడుతుందని నిపుణులు అంటున్నారు. అంగ స్తంభనలోపం ఉన్న వారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది.

వీర్యం ఉత్పత్తి పెంచడంలో స్ట్రాబెర్రీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆకిడ్సెంట్స్‌ లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. 

మిర్చిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పురుషాంగానికి రక్త ప్రసరణ మెరుగువుతుంది.

పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఉల్లి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్ ఎల్లిసిన్‌ రక్తాన్న గడ్డకుండా చేసే రక్తప్రసరణ పెంచుతుంది.

దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషల్లో స్టామినా పెరుగుతుంది. శృంగార సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో పుచ్చకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలోని ఎల్‌సిట్రైన్‌ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.