క్యాన్సర్‌ రావొద్దంటే.. 

TV9 Telugu

10 February  2024

క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో నారింజ ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. 

గ్రీన్‌ టీ కూడా క్యాన్సర్‌ను జయించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అన్నవాహి, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. 

అల్లం క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్‌ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎంతో మేలు చేస్తాయి.  ముఖ్యంగా రొమ్ము, పెద్దపేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. 

యాపిల్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందని తెలిసిందే. క్యాన్సర్‌ను దరిచేరనివ్వకుండా కూడా యాపిల్ ఉపయోగపడుతుంది. రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లను దూరం చేయడంలో యాపిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. 

దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించడంలో దానిమ్మ ఉపయోగపడుతుంది. 

క్రమంతప్పకుండా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బయోఫ్‌లేవనాయిడ్స్‌, ఆల్ఫా కెరోటిన్‌లు క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.