బీపీ వెంటనే కంట్రోల్ అవ్వాలంటే రోజుకో అరటి పండును కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం కంటెంట్ బీపీ కంట్రోల్ అవుతుంది.
బీపీ సమస్య ఉన్న వారు తీసుకునే ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆకు కూరల్లో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది.
బీపీని కంట్రోల్ చేయడంలో డార్క్ చాక్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫ్లెవనాయిడ్స్‌బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తాయి
బెర్రీలు కూడా బీపీని తగ్గించడంలో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి.
ప్రతీ రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బీపీని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి ఉల్లిపాయ ముక్కను తింటే వెంటనే మార్పు చూడొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.