చలికాలం రోగాలు..  ఇలా పరార్‌

18 November 2023

చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వచ్చే రెండు నెలలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన శైలిలో కొన్ని మార్పులతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. 

సాధారణంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి వాటి బారిన పడకూడదంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. 

ఇన్ఫెక్షన్లు దారి చేరకుండా అడ్డుకోవడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ బ్యార్టీరియల్, యాంటీ ఫంగల్‌ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

ఇక వింటర్‌లో మిరియాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. 

చలికాలం అని కొబ్బరి నీళ్లను తీసుకోకుండా ఉండొద్దు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సీజనల్‌ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. 

సీజనల్ వ్యాధులను అడ్డుకోవడంలో పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నారింజ, ద్రాక్ష, కివీస్‌, యాపిల్స్‌ వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. 

మొలకలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్, విటమిన్లు శరీరానికి మేలు చేస్తాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.