TV9 Telugu

12 April 2024

ఆస్తమా ఉన్న వారు ఏం తినాలంటే.. 

ఆస్తమాతో బాధపడే వారు ఆహారంలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా క్యారెట్స్, ఆకుకూరలను తీసుకోవాలి.

ఇక విటమిన్‌ డీ ఎక్కువగా ఉండే ఆహార పదర్థాలను తీసుకుంటే ఆస్తమా బాధితులకు మేలు చేస్తుంది. ఇందుకోసం పాలు, గుడ్లు, సాల్మన్‌ చేపలను తీసుకోవాలి.

ఆస్తమా సమస్యతో బాధపడే వారికి అరటి పండ్లు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ ఆస్తమా బాధితులకు మేలు చేస్తాయి. 

ఆస్తమాతో బాధపడే వారు యాపిల్‌ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డార్క్‌ డార్క్‌ చాక్లెట్‌, గుమ్మడి గింజలు ఆస్తమాను తగ్గిస్తుంది. ఇందులోని మెగ్నీషియం ఆస్తమా రోగులకు ఉపశమనం లభిస్తుంది.

ఇక ఆస్తమాతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

ఆస్తమా బాధితులు గ్యాస్‌ని ఉత్పత్తి చేసే క్యాబేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.