TV9 Telugu
11 March 2024
ఆందోళనకు చెక్ పెట్టే ఆహారం..
ఆందోళన, ఒత్తిడిని దూరం చేయడంలో డార్క్ చాక్లెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ మూడ్-బూస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఒత్తిడిని చిత్తు చేయడంలో గ్రీన్ టీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులోని లిథినైన్ అనే అమైనో ఆమ్లం, విశ్రాంతిని, నిద్రను మెరుగుపరుస్తుంది.
మెగ్నీషియం ఎక్కువగా ఉండే జీడిపప్పును నిత్యం తీసుకోవడం వల్ల.. విశ్రాంతి, ప్రశాంతతను చేకూర్చటంలో సహాయపడుతుంది.
ఆందోళనతో బాధపడుతుంటే బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ విశ్రాంతిని ఇస్తాయి.
సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
పసులో కర్కుమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది యాంటి యాంగ్జయిటీ ఎఫెక్ట్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో ఆందోళన దూరమవుతుంది.
ఆందోళనను దూరం చేయడంలో అవకాడో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, B విటమిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..