TV9 Telugu
7 April 2024
ఆ సమయంలో ఈ ఆహారం తీసుకోవాలి..
నెలసరి సమయంలో కెఫిన్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులోని ఆమ్లాలు నొప్పిని పెంచే అవకాశం ఉంటుంది.
ఈ సమయంలో విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిమ్మకాయ, నారింజ వంటివి తీసుకోవాలి
డార్క్ చాక్లెట్‌ను తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి తట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సెరోటోనిన్‌ని పెంచుతుంది.
ఈ సమయంలో బీట్‌రూట్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తస్రావం కోల్పోయిన రక్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
ఇక తీసుకునే ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఈ సమయంలో జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. బేకరీ ఫుడ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటిచడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..