హైదరాబాద్ లో ఇక్కడ ఫుడ్ తింటే ఆహా  అనాల్సిందే..

TV9 Telugu

04 May 2024

చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ రెస్టారెంట్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్. ఇది రుచికరమైన కబాబ్‌లు, ఇతర  నాన్ వెజ్ ఆహారాలకి  ప్రసిద్ధి చెందిన ప్రదేశం.

పిస్తా హౌస్‌కి హైదరాబాద్‌లో డజనుకు పైగా బ్రాంచిలు ఉన్నాయి. అయితే దాని చార్మినార్ అవుట్‌లెట్ మాత్రం ఓ రేంజ్ టేస్టీ ఫుడ్.

షా గౌస్ రుచికరమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, శాకాహారం, మాంసాహారం వంటి విభిన్న రకాల వంటకాలకు చాల ప్రసిద్ధి.

నాంపల్లిలో ఉన్న రామ్ కి బండి ప్రసిద్ధ భారతీయ స్నాక్స్‌లో ట్విస్ట్‌లను ఇష్టపడే వారికి స్వర్గధామని చెప్పాలి.

హైదరాబాద్ లో ఉత్తమ ఫుడ్ డెస్టినేషన్స్ లో నిమ్రా కేఫ్ అంటే బేకరీ కూడా ఒకటి. ఇది 1960ల నాటి ఇరానీ కేఫ్.

మీరు కొన్ని నార్త్ ఇండియన్ చాట్‌లను కోరుకుంటే, ప్రసిద్ధ మహారాజా చాట్ ఖచ్చితంగా మీ ఆకలిని తీరుస్తుంది.

చాచాజీస్ వడ పావ్‌స్ నగరం అంతటా, వెలుపల కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇది గుజరాతీ స్పెషల్ డబెలిస్‌కి ప్రసిద్ధి చెందింది.

చార్మినార్ దగ్గర మిలన్ జ్యూస్ సెంటర్ కూడా వీటిలో ఒకటి. ఇక్కడ షాహ్‌దూద్ మలై రుచి చూశారంటే వావ్ అంటారు.