మగువలూ.. ఈ ఫేస్ ప్యాక్స్‎తో మీ ముఖం చంద్రబింబంలా మెరుస్తుంది.. 

31 July 2025

Prudvi Battula 

1 టీస్పూన్ పసుపు పొడిని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

పసుపు, తేనె ఫేస్ ప్యాక్

2 టేబుల్ స్పూన్ల పెరుగును 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్‎తో కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

పెరుగు, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

దోసకాయ తురుము, తరిగిన తాజా పుదీనా ఆకులతో కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

దోసకాయ, పుదీనా ఫేస్ ప్యాక్

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటిపండు, తేనె ఫేస్ ప్యాక్

పండిన బొప్పాయిని మెత్తగా చేసి, 1/2 టీస్పూన్ పసుపుతో కలిపి, ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.

బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్

తురిమిన దోసకాయతో కలబంద జెల్ కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

అలోవెరా, దోసకాయ ఫేస్ ప్యాక్

2 టేబుల్ స్పూన్ల శనగపిండిని 1 టేబుల్ స్పూన్ పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.

శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్

గ్రీన్ టీ బ్యాగ్‌ను వేడి నీటిలో ముంచి చల్లబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

గ్రీన్ టీ ఫేస్ ప్యాక్