మారుతి సుజుకి వ్యాగనార్ సీఎన్జీ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కారు ఏకంగా 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండడం విశేషం. ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా టియోగో సీఎన్జీ కారు కిలో సీఎన్‌జీ గ్యాస్‌కు ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. ఈ కారు ధర రూ. 7.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను అందించారు.
మంచి మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో టాటా పంచ్ సీఎన్జీ ఒకటి. ఈ కారు 27 కి.మీల మైలేజ్‌ను ఇస్తుంది. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన కారుకు మంచి ఆదరణ లభిస్తోంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సీఎన్జీ కారు కిలో సీఎన్జీతో ఏకంగా 28 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.68 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టయోటా గ్లాంజా సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు అత్యధికంగా కిలో సీఎన్‌జీకి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజికి డిజైర్ సీఎన్‌జీ ఏకంగా కిలో CNGతో 31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లలో మారుతి సుజికి ఎస్‌ప్రెస్సో ఒకటి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.91 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు కిలో సీఎన్‌జీతో 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో మారుతి సుజుకి ఆల్లో కే10 ఒకటి. ఈ కారు కిలో సీఎన్జీతో ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర విషయానికొస్తే దీని ప్రారంభ వేరియంట్ రూ. 5.73 లక్షల నుంచి మొదలవుతుంది .