పొట్లకాయతో పుట్టెడు లాభాలు.. 

Narender Vaitla

06 October 2024

కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పొట్లకాయ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపుబ్బరం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

పొట్లకాయలో ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పొట్లకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బయోటిక్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? అయితే క్రమం తప్పకుండా పొట్లకాయ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

శ్వాస సంబంధిత సస్యలతో బాధపడేవారికి పొట్లకాయం మంచి ఔషధంగా చెప్పొచ్చు. ఇందులోని మంచి పోషకాలు శ్వాస సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవడంలో ఉపయోగపడుతుంది.

పొట్లకాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోపడుతుంది. ఆస్టియోపోరోసిస్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్‌ సమస్యను తగ్గించంతో పాటు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.