వేపలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది చర్మ, జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.
TV9 Telugu
మీ బ్యూటీ రొటీన్‌లో వేపను చేర్చడం వల్ల అందానికి సంబంధించిన చాలా సమస్యలు దూరమవుతాయి. వేపలోని అద్భుత ఔషధ గుణాలు జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి.
TV9 Telugu
వేప నూనెని హెయిర్‌కేర్ రొటీన్‌లో యాడ్ చేసి మసాజ్ చేస్తే హెల్దీ సెల్స్ పెరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో హెయిర్‌ఫోలికల్స్ బలంగా మారి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
TV9 Telugu
వేపనూనె వాడకంతో జుట్టు పల్చబడదు. ఊడిపోదు, పొల్యూషన్, స్ట్రెస్, మెడికేషన్ వల్ల జుట్టు రాలే సమస్యలుంటే అవి కూడా తగ్గిపోతాయి.
TV9 Telugu
వేప నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బట్టతలని తగ్గిస్తాయి. దీంతో పాటు సోరియాసిస్‌ని దూరం చేస్తాయి.
TV9 Telugu
జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. దీనిని రాయడం వల్ల జుట్టు డ్రైగా మారదు.
TV9 Telugu
వేప నూనె రాయడం వల్ల పేల సమస్య తగ్గుతుంది. జుట్టు బ్రేకేజ్ అవ్వడం వంటి సమస్యల్ని తగ్గించి జుట్టు బలంగా మారేలా చేస్తుంది. జుట్టుని మాయిశ్చరైజ్ అయ్యేలా చేస్తుంది.
TV9 Telugu
వేప నూనె రాయడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. రెగ్యులర్‌గా రాస్తే కచ్చితంగా జుట్టు తెల్లబడడం కాస్తా కంట్రోల్ అవుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.