వేప చెట్టు లో ఉండే ప్రతి ఒక్క భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేపను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడుతుంది
వేపలో విటమిన్ C ఉండటం వల్ల అనేక చర్మ సమస్యల తొలగిస్తుంది. వేపాకుతో తయారు చేసిన సబ్బులు ఉపయోగించేవారి చర్మం కోమలంగా, యవ్వనంతో ఉంటుంది.
వేపాకు సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం పై వచ్చే నల్ల మచ్చలను, మొటిమలను, తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు వేపాకును ఉపయోగించడం వల్ల ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా చేస్తుంది. పొడి బారిన చర్మం ఉన్నవారికి మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తుంది.
చుండ్రు సమస్య సమస్య ఉన్నవారు, దురదలు, జుట్టు రాలుటం వంటి సమస్యలు ఉన్నవారికి వేపాకు పొడి చెక్ పెడుతుందనే అనే చెప్పాలి.
జుట్టు ఒత్తుగా పెరగడానికి వేప తైలం ఉపయోగపడుతుందనే చెప్పాలి. వేప తైలం లో ఉండే విటమిన్ E జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది.