కురులకు కండీషనర్‌గా పచ్చిపాలు..

22 September 2023

పాలు ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలు జుట్టుకు కండీషనర్‌గా పనిచేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. పాలను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది

ధుమ్మూ-కాలుష్యం, సూర్యుని నుంచి వెలువడే హానికరమైన కిరణాల వల్ల జుట్టుకి వాటిల్లే నష్టాన్ని తొలగించడంలో పాలు సహాయపడుతుంది

నిర్జీవంగా, పొడిబారిన డ్రై హెయిర్ సమస్యను పాలు సులభంగా తొలగిస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా పాలు నివారిస్తుంది. కండీషనర్‌గా పాలను ఎలా ఉపయోగించాలంటే..

పాలను కండీషనర్ ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, కోమలంగా, సిల్కీగా మారుతుంది. వెంట్రుకలకు పాలను వినియోగించడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి

నిజానికి.. పాలు చర్మానికి క్లెన్సర్‌గా పనిచేసినట్లే, జుట్టును శుభ్రపరచడంలో కూడా అదే విధమైన ఫలితాలను అందిస్తాయి

ముందుగా జుట్టును దువ్వుకుని.. పచ్చి పాలను వెంట్రుకలకు హెయిర్ స్ప్రేగా కూడా ఉపయోగించవచ్చు. 200 మిల్లీలీటర్ల పచ్చి పాలను స్ప్రే బాటిల్ నింపుకుని దువ్విన జుట్టుకు స్ప్రే చేయాలి

పాలతో తల భాగాన్ని, జుట్టును బాగా మసాజ్ చేసుకోవాలి. 30 నిమిషాలు అలాగే ఉంచుకుని షాంపూతో తలస్నానం చేస్తే సరి

పాలను కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు స్ప్రే చేసుకోవడం వల్ల పాలలోని పోషకాలు సమపాల్లలో వెంట్రుకలకు చేరుతుంది. ఫలితంగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతం అవుతాయి