ముద్దుతో ఇన్ని లాభాలున్నాయా.. 

Narender Vaitla

16 November 2024

ముద్దు పెట్టుకున్న సమయంలో శరీరంలో సంతోషాన్ని పెంచే హార్మోన్లు ఉత్పత్తి పెరుగాయి. మెదడులో విడుదలయ్యే ఆక్సిటోసిన్‌, డోపామైన్‌, సెరోటినిన్‌ వంటి రసాయనాలు సంతోషాన్ని కలిగిస్తాయి.

ముద్దు శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ముద్దును మంచి స్ట్రెస్‌ బస్టర్‌గా చెబుతుంటారు నిపుణులు.

రక్తపోటును అదుపు చేయడంలో కూడా ముద్దు ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ సమయంలో శరీరంలో రక్త నాళాలు విస్తరిస్తాయి. దీంతో రక్తపోటు సమస్య దూరమవుతుంది.

ముద్దు పెట్టుకున్న సమయంలో నోటిలో లాలాజలం ఎక్కువ మొత్తంలో స్రవిస్తుంది. ఇది కావిటీస్‌కు దారితీసే దంతాలపై ఉండే ఫలకాన్ని పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. దీంతో పంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

ముద్దు శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటు వ్యాధులతో పోరాడే నిరోధక శక్తి పెరుగుతుంది.

నిమిషం పాటు ముద్దు 2 నుంచి 3 కేలరీలను బర్న్‌ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి మంచి వ్యాయామంగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ముఖం యవ్వనంగా కనిపించడంలో కూడా ముద్దు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతారు. ముద్దు ముఖ కండరాలను కదిలేలా చేస్తుంది. ఇది మీ ముఖ కండరాలను టోనింగ్ చేయడానికి సహాయపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.