భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

Jyothi Gadda

10 August 2024

నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

బరువు తగ్గాలని చాలా మంది ఉదయాన్నే పరిగడుపున లెమన్ వాటర్ ను తాగుతుంటారు. కానీ మీరు భోజనం చేసిన తర్వాత కూడా లెమన్ వాటర్ తాగొచ్చు. దీనివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం

తిన్న వెంటనే నిమ్మరసం తాగితే  మీ జీర్ణక్రియ బాగుంటుంది. ఇది మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని  కూడా పెంచుతుంది. తిన్న తర్వాత లెమన్ వాటర్ తాగితే చర్మం అందంగా మెరిసిపోతుంది

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ నష్టం లేదా ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ.. ఇది గ్యాస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి  కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది మన శరీరం నుంచి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది  రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది.

రోజూ భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే .. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.