Benefits of Rose Petals : అందానికే కాదు ఆరోగ్యానికి గులాబీ రేకులు దివ్యౌషధం..
20 November 2023
గులాబీ పూలు కేవలం అలంకరణ, అందం కోసమే మాత్రమే కాదు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
గులాబీ రేకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగిస్తుంది. గులాబీ రేకుల ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గులాబీ రేకులను రోజు వారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు సులభంగా కోల్పోతారు. ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో నాటు గులాబీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకులతో తయారు చేసిన కషాయం తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ పోతుంది.
గులాబీ పువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్ చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.
గులాబీ రేకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి.
లైంగి సామార్ధ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.