ఖర్జూరాన్ని నెయ్యితో కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? 

18 November 2023

ఖర్జూరం, నెయ్యి శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు, ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో నెయ్యి, ఖర్జూరం ఎంతగానో సహాయపడతాయి. 

ఆయుర్వేదం ప్రకారం, నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. మంచి ఆరోగ్యకరమైన నిద్రకు దారితీస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. అవి ఇనుము గొప్ప మూలం కూడా. శరీరానికి కావల్సిన ఎనర్జీని పెంచడంలో కూడా ఇవి సహకరిస్తాయి.

ఖర్జూరాలు రక్తపోటును నిర్వహించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. 

నెయ్యి ఒక ఆరోగ్యకరమైన కొవ్వు, ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. 

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, లినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.